విద్యార్థులు గ్రంథాలయాలకు క్రమం తప్పకుండా వచ్చి పఠనాశక్తిని పెంపొందించుకోవాలని మాజీ శాసన సభ్యురాలు పిడతల సాయి కల్పనా రెడ్డి గారు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు కార్యక్రమాన్ని ముందుగా జవహర్లాల్ నెహ్రూ పటానికి పూల మాలవేసి నివాళులర్పించి ప్రారంభించారు. విశ్రాంత ఆచార్యులు సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ పుస్తకాలను చదివి జీవిత గతులను మార్చుకున్న వారు ఎందరో ఉన్నారని అన్నారు. పఠనాశక్తి తగ్గడం జరిగితే మనం మన ప్రజ్ఞను కోల్పోతాం అన్నారు. స్థానిక శ్రీనివాస డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పి వి తిరుపతి రెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి అందించిన సేవలను వివరించగా, గ్రంథపాలకులు గొలమారి రామకృష్ణారెడ్డి గారు గ్రంథాలయానికి పన్నెండు వందల మంది సభ్యులు ఉన్నారని ఆనాడు పిడతల సాయి కల్పనా రెడ్డి గారి కృషి వల్ల అత్యంత విలువైన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి గ్రంధాలయానికి అప్పగించారని ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పిడతల సాయి కల్పన రెడ్డి గారు విద్యార్థులచే ప్రతిదినం గ్రంధాలయానికి వచ్చి చదువుకుంటానని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గంజి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.