గుండెనిండా పొంగిపొరలేదే కవిత
నన్నయ్య గారి అనువాదంతో ప్రారంభమైన తెలుగు సాహిత్యంలో సృజన ఉన్నా, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మనిషిని గుర్తించిన గురజాడ కవిత్వం లోనే అసలైన సృజన ఉన్నదని విశ్రాంత ఆంధ్రోపన్యాసకులుగా సూరం నారాయణరెడ్డి గారు అన్నారు.
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సాహిత్యంలో సృజన అన్న అంశంపై జరిగిన చర్చలో ఆయన సభాధ్యక్షులుగా వ్యవహరించి ప్రసంగించారు. పాల్కురికి సోమన కోడికూత లోను అటువంటి సృజనే ఉన్నదన్నారు. రిటైర్డ్ తెలుగు పండిట్ షేక్ దస్తగిరి సాహిత్యానికి పోషకులు, ఆశ్రితులు తగ్గి పోతున్నారు అని అన్నారు . రాచర్ల మండలం జేపీ చెరువు హై స్కూలు ఉపాధ్యాయులు డి కిరణ్ గారు మాట్లాడుతూ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే శక్తి సాహిత్యానికి ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు గొలమారి రామకృష్ణారెడ్డి ,డి ముసలా రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు మూర్తయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.