Wednesday, November 21, 2018
19.11.2018 పాటల పోటీలు
విద్యార్థులకు పాటల పోటీలు
శాఖా గ్రంధాలయం గిద్దలూరులో సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి గిద్దలూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ మల్లికార్జున రావు గారు మరియు బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయునిలు శ్రీమతి వరూధిని గారు శ్రీమతి ఇందిరా గారు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సీనియర్స్ పాటల పోటీలు జరిగినవి. ఇంటర్ విద్యార్థులకు ఒక వకృత్వ పోటీ జరిగినది సాయంత్రం జూనియర్ విద్యార్థులకు పాటల పోటీలు జరిగినవి. ఇందులో కే ముర్తయ్య గారు విశ్రాంత ఉపాధ్యాయులు, మరియు స్వర్ణలత పి డి గారు ,అనంతలక్ష్మి ,విద్యార్థులు పాల్గొన్నారు.
Monday, November 19, 2018
18-11-2018 కవి సమ్మేళనం
గుండెనిండా పొంగిపొరలేదే కవిత
నన్నయ్య గారి అనువాదంతో ప్రారంభమైన తెలుగు సాహిత్యంలో సృజన ఉన్నా, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మనిషిని గుర్తించిన గురజాడ కవిత్వం లోనే అసలైన సృజన ఉన్నదని విశ్రాంత ఆంధ్రోపన్యాసకులుగా సూరం నారాయణరెడ్డి గారు అన్నారు.
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సాహిత్యంలో సృజన అన్న అంశంపై జరిగిన చర్చలో ఆయన సభాధ్యక్షులుగా వ్యవహరించి ప్రసంగించారు. పాల్కురికి సోమన కోడికూత లోను అటువంటి సృజనే ఉన్నదన్నారు. రిటైర్డ్ తెలుగు పండిట్ షేక్ దస్తగిరి సాహిత్యానికి పోషకులు, ఆశ్రితులు తగ్గి పోతున్నారు అని అన్నారు . రాచర్ల మండలం జేపీ చెరువు హై స్కూలు ఉపాధ్యాయులు డి కిరణ్ గారు మాట్లాడుతూ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే శక్తి సాహిత్యానికి ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు గొలమారి రామకృష్ణారెడ్డి ,డి ముసలా రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు మూర్తయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.
17.11.2018 చిత్రలేఖనం పోటీలు
బాల బాలికలకు చిత్రలేఖనం పోటీలు
గిద్దలూరు గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వరోత్సవాల్లో భాగంగా చిత్రలేఖన పోటీలను శనివారం నిర్వహించినట్లు స్థానిక గ్రంథాలయాధికారి గొలమారి రామకృష్ణ రెడ్డి తెలిపారు. స్థానిక గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన ఈ పోటీల్లో అధిక శాతం మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేస్తామన్నారు.
Sunday, November 18, 2018
16.11.2018 వ్యాస రచన పోటీలు
16.11.2018 వ్యాస రచన పోటీలు
గిద్దలూరు శాఖ గ్రంథాలయంలో 16.11.2018 వ తేదీన ఉదయం సీనియర్ విద్యార్థులకు " నేటి యువత పై సినిమాల ప్రభావం " అనే అంశంపై వక్తృత్వ పోటీలు జరిగినది మరియు మధ్యాహ్నం రెండు గంటలకు జూనియర్ విద్యార్థులకు ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే నష్టాలు నివారించే మార్గాలు అనే అంశంపై వక్తృత్వ పోటీలు జరిగినవి. 70 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనగా పర్యవేక్షకులుగా గర్ల్స్ హైస్కూల్ తెలుగు పండిట్ శ్రీమతి వరూధిని గారూ, విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ బి ఓబులేసు మరియు శ్రీ మూర్తయ్య గారు , గ్రంథపాలకులు గొలమారి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.
Thursday, November 15, 2018
14-11-2018 గ్రంధాలయ వేడుకలు ప్రారంభం
పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మ దినం
విద్యార్థులు గ్రంథాలయాలకు క్రమం తప్పకుండా వచ్చి పఠనాశక్తిని పెంపొందించుకోవాలని మాజీ శాసన సభ్యురాలు పిడతల సాయి కల్పనా రెడ్డి గారు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు కార్యక్రమాన్ని ముందుగా జవహర్లాల్ నెహ్రూ పటానికి పూల మాలవేసి నివాళులర్పించి ప్రారంభించారు. విశ్రాంత ఆచార్యులు సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ పుస్తకాలను చదివి జీవిత గతులను మార్చుకున్న వారు ఎందరో ఉన్నారని అన్నారు. పఠనాశక్తి తగ్గడం జరిగితే మనం మన ప్రజ్ఞను కోల్పోతాం అన్నారు. స్థానిక శ్రీనివాస డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పి వి తిరుపతి రెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి అందించిన సేవలను వివరించగా, గ్రంథపాలకులు గొలమారి రామకృష్ణారెడ్డి గారు గ్రంథాలయానికి పన్నెండు వందల మంది సభ్యులు ఉన్నారని ఆనాడు పిడతల సాయి కల్పనా రెడ్డి గారి కృషి వల్ల అత్యంత విలువైన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి గ్రంధాలయానికి అప్పగించారని ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పిడతల సాయి కల్పన రెడ్డి గారు విద్యార్థులచే ప్రతిదినం గ్రంధాలయానికి వచ్చి చదువుకుంటానని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గంజి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)



























