Monday, May 7, 2018

ఘనంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకలు 


విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 157వ జయంతి కార్యక్రమాన్ని యువ ప్రగతి పథం సంస్థ గిద్దలూరులో నిర్వహించింది. స్థానిక శాఖా గ్రంధాలయములో రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి వేమన సేవా సంస్థ అధ్యక్షులు హనుమంతా రెడ్డి గారు పుష్పాంజలిఘటించి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభకు యువ ప్రగతి పథం సంస్థ అధ్యక్షుడు సయ్యద్ ఫరూక్ అధ్యక్షత వహించారు. సభలో హనుమంతా రెడ్డి గారు ప్రసంగిస్తూ విశ్వమానవ సోదర భావాన్ని ప్రభోదించి లోకహితుడిగా, లోక మిత్రుడిగా ,లోకగురువుగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కీర్తి పొందాడన్నారు.గ్రంధపాలకుడు గొలమారి రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ సాంస్కృతీ వైభవాన్ని ప్రపంచ ప్రజలకు ఛాటి భారతీయ సాహిత్యానికి ప్రపంచంలో గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది 'ఠాగూరే'నన్నారు. ఆసియా ఖండంలోనే మొదటిసారిగా నోబుల్ బహుమతి గెలుచుకున్న రవీంద్రుని గీతాంజలిగేయాలు ప్రపంచ ప్రజల్ని ముగ్ధులను చేశాయన్నారు. యువ ప్రగతి పథం సంస్థ ఉపాధ్యక్షుడు గొలమారి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ లాంటి మహనీయులు కూడా రవీంద్రుని తమ గురుదేవులుగా ప్రకటించుకుని గౌరవించారన్నారు. తన దేశభక్తి గేయాల ద్వారా దేశ ప్రజల్ని మేల్కొలిపి తెల్లదొరల పాలన అంత మొందించటానికి కారకుడయ్యాడన్నారు.ఈనాటి మన జాతీయ గీతం జనగణమణ ఆయన కలం నుండి వచ్చిందేనన్నారు. ఠాగూర్ గీతాలను ఆలపించారు.ఈ కార్యక్రమంలో యువ ప్రగతి పథం సంస్థ అధ్యక్షుడు ఫరూక్,ఉపాధ్యక్షులు గొలమారి జగదీశ్వర రెడ్డి ,విశ్రాంత ఉపాధ్యాయుడు ముత్తుముల వీరా రెడ్డి,వేమన సేవా సంస్థ అధ్యక్షుడు హనుమంతా రెడ్డి ,గ్రంధపాలకుడు గొలమారి రామకృష్ణ రెడ్డి ,సభ్యులు కిరణ్ బాబు ,రమేష్ ,అంకయ్య ,గౌతమ్,బాలా క్రిష్ణాచారి,ఇమ్రాన్,రసూల్,అంజి రెడ్డి,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.