Wednesday, November 21, 2018

20.11.2018 విజేతలకు బహుమతుల పంపిణి

విజేతలకు బహుమతుల పంపిణి 


గిద్దలూరు పట్టణంలో గల గ్రంధాలయం నందు నవంబర్ 14 నుండి 20 వరకు జరిగిన గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా ఈ రోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు గ్రంధాలయ వారోత్సవ ముగింపు సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంనకు గిద్దలూరు నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డిగారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా గ్రంథాలయ పాలకుడు రామక్రిష్ణారెడ్డి గారు, మండల విద్యాశాఖాధికారి సూర కాశిరంగారెడ్డిగారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి లక్ష్మీదేవి గారు ఎం ఎల్ ఏ గారిని పూల మాలతో సత్కరించడం జరిగినది. ఈ క్రమంలో గ్రంధాలయం వారు విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎం ఎల్ ఎ ముత్తుముల అశోక్ రెడ్డి గారి చే మెమోంటోలను అంద జేయడం జరిగినది. ఈ కార్యక్రమం నందు దప్పిలి కాశిరెడ్డిగారు, సిఐ శ్రీరామ్ గారు,రిటైర్డ్ లెక్చరర్ నారాయణ రెడ్డిగారు మరియు పాఠశాల నందలి ఉపాధ్యాయ ఉపాధ్యాయునులు, విద్యార్థినులు పాల్లొనడం జరిగినది.








19.11.2018 పాటల పోటీలు

విద్యార్థులకు పాటల పోటీలు 


శాఖా గ్రంధాలయం గిద్దలూరులో సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి గిద్దలూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ మల్లికార్జున రావు గారు మరియు బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయునిలు శ్రీమతి వరూధిని గారు శ్రీమతి ఇందిరా గారు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సీనియర్స్ పాటల పోటీలు జరిగినవి. ఇంటర్ విద్యార్థులకు ఒక వకృత్వ పోటీ జరిగినది సాయంత్రం జూనియర్ విద్యార్థులకు పాటల పోటీలు జరిగినవి. ఇందులో కే ముర్తయ్య  గారు విశ్రాంత ఉపాధ్యాయులు, మరియు స్వర్ణలత పి డి గారు ,అనంతలక్ష్మి ,విద్యార్థులు పాల్గొన్నారు.









Monday, November 19, 2018

18-11-2018 కవి సమ్మేళనం

గుండెనిండా పొంగిపొరలేదే కవిత 



నన్నయ్య గారి అనువాదంతో ప్రారంభమైన తెలుగు సాహిత్యంలో సృజన ఉన్నా, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మనిషిని గుర్తించిన గురజాడ కవిత్వం లోనే అసలైన సృజన ఉన్నదని విశ్రాంత ఆంధ్రోపన్యాసకులుగా  సూరం నారాయణరెడ్డి గారు అన్నారు. 
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సాహిత్యంలో సృజన  అన్న అంశంపై జరిగిన చర్చలో ఆయన సభాధ్యక్షులుగా వ్యవహరించి ప్రసంగించారు. పాల్కురికి సోమన కోడికూత లోను అటువంటి సృజనే ఉన్నదన్నారు. రిటైర్డ్ తెలుగు పండిట్ షేక్ దస్తగిరి సాహిత్యానికి పోషకులు, ఆశ్రితులు తగ్గి పోతున్నారు అని అన్నారు . రాచర్ల మండలం జేపీ చెరువు హై స్కూలు ఉపాధ్యాయులు డి కిరణ్ గారు మాట్లాడుతూ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే శక్తి సాహిత్యానికి ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు గొలమారి రామకృష్ణారెడ్డి ,డి ముసలా రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు మూర్తయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.





17.11.2018 చిత్రలేఖనం పోటీలు


బాల బాలికలకు చిత్రలేఖనం పోటీలు 



గిద్దలూరు  గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వరోత్సవాల్లో భాగంగా చిత్రలేఖన పోటీలను శనివారం  నిర్వహించినట్లు స్థానిక గ్రంథాలయాధికారి గొలమారి రామకృష్ణ రెడ్డి  తెలిపారు. స్థానిక గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన ఈ పోటీల్లో అధిక శాతం మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేస్తామన్నారు. 

Sunday, November 18, 2018

16.11.2018 వ్యాస రచన పోటీలు

16.11.2018 వ్యాస రచన  పోటీలు


గిద్దలూరు శాఖ గ్రంథాలయంలో 16.11.2018 వ తేదీన ఉదయం సీనియర్ విద్యార్థులకు " నేటి యువత పై సినిమాల ప్రభావం " అనే అంశంపై వక్తృత్వ పోటీలు జరిగినది మరియు మధ్యాహ్నం రెండు గంటలకు జూనియర్ విద్యార్థులకు ప్లాస్టిక్  వాడకం వలన వచ్చే నష్టాలు నివారించే మార్గాలు అనే అంశంపై వక్తృత్వ పోటీలు జరిగినవి. 70 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనగా పర్యవేక్షకులుగా గర్ల్స్ హైస్కూల్ తెలుగు పండిట్  శ్రీమతి వరూధిని గారూ, విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ బి ఓబులేసు మరియు శ్రీ మూర్తయ్య గారు , గ్రంథపాలకులు గొలమారి రామకృష్ణారెడ్డి  గారు పాల్గొన్నారు.









Thursday, November 15, 2018

15.11.2018 పుస్తక ప్రదర్శన

పుస్తక ప్రదర్శన

గ్రంధాలయము వాటి ప్రాముఖ్యత ఫై ఉపన్యాసము 



పుస్తక ప్రదర్శన సందర్భంగా సందేశం ఇస్తున్న  MEO.శ్రీ కాశీరంగా  రెడ్డి   శాఖ గ్రంధాలయం.గిద్దలూరు






14-11-2018 గ్రంధాలయ వేడుకలు ప్రారంభం

పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మ దినం 


 విద్యార్థులు గ్రంథాలయాలకు క్రమం తప్పకుండా వచ్చి పఠనాశక్తిని పెంపొందించుకోవాలని మాజీ శాసన సభ్యురాలు పిడతల సాయి కల్పనా రెడ్డి గారు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు కార్యక్రమాన్ని ముందుగా జవహర్లాల్ నెహ్రూ పటానికి పూల మాలవేసి  నివాళులర్పించి ప్రారంభించారు. విశ్రాంత ఆచార్యులు సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ పుస్తకాలను చదివి జీవిత గతులను మార్చుకున్న వారు ఎందరో ఉన్నారని అన్నారు. పఠనాశక్తి తగ్గడం జరిగితే మనం మన ప్రజ్ఞను కోల్పోతాం అన్నారు. స్థానిక శ్రీనివాస డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పి వి తిరుపతి రెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి అందించిన సేవలను వివరించగా, గ్రంథపాలకులు గొలమారి రామకృష్ణారెడ్డి  గారు గ్రంథాలయానికి పన్నెండు వందల మంది సభ్యులు ఉన్నారని ఆనాడు పిడతల సాయి కల్పనా రెడ్డి గారి కృషి వల్ల అత్యంత విలువైన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి గ్రంధాలయానికి అప్పగించారని ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పిడతల సాయి కల్పన రెడ్డి గారు విద్యార్థులచే ప్రతిదినం గ్రంధాలయానికి వచ్చి చదువుకుంటానని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గంజి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.







Monday, May 7, 2018

ఘనంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకలు 


విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 157వ జయంతి కార్యక్రమాన్ని యువ ప్రగతి పథం సంస్థ గిద్దలూరులో నిర్వహించింది. స్థానిక శాఖా గ్రంధాలయములో రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి వేమన సేవా సంస్థ అధ్యక్షులు హనుమంతా రెడ్డి గారు పుష్పాంజలిఘటించి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభకు యువ ప్రగతి పథం సంస్థ అధ్యక్షుడు సయ్యద్ ఫరూక్ అధ్యక్షత వహించారు. సభలో హనుమంతా రెడ్డి గారు ప్రసంగిస్తూ విశ్వమానవ సోదర భావాన్ని ప్రభోదించి లోకహితుడిగా, లోక మిత్రుడిగా ,లోకగురువుగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కీర్తి పొందాడన్నారు.గ్రంధపాలకుడు గొలమారి రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ సాంస్కృతీ వైభవాన్ని ప్రపంచ ప్రజలకు ఛాటి భారతీయ సాహిత్యానికి ప్రపంచంలో గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది 'ఠాగూరే'నన్నారు. ఆసియా ఖండంలోనే మొదటిసారిగా నోబుల్ బహుమతి గెలుచుకున్న రవీంద్రుని గీతాంజలిగేయాలు ప్రపంచ ప్రజల్ని ముగ్ధులను చేశాయన్నారు. యువ ప్రగతి పథం సంస్థ ఉపాధ్యక్షుడు గొలమారి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ లాంటి మహనీయులు కూడా రవీంద్రుని తమ గురుదేవులుగా ప్రకటించుకుని గౌరవించారన్నారు. తన దేశభక్తి గేయాల ద్వారా దేశ ప్రజల్ని మేల్కొలిపి తెల్లదొరల పాలన అంత మొందించటానికి కారకుడయ్యాడన్నారు.ఈనాటి మన జాతీయ గీతం జనగణమణ ఆయన కలం నుండి వచ్చిందేనన్నారు. ఠాగూర్ గీతాలను ఆలపించారు.ఈ కార్యక్రమంలో యువ ప్రగతి పథం సంస్థ అధ్యక్షుడు ఫరూక్,ఉపాధ్యక్షులు గొలమారి జగదీశ్వర రెడ్డి ,విశ్రాంత ఉపాధ్యాయుడు ముత్తుముల వీరా రెడ్డి,వేమన సేవా సంస్థ అధ్యక్షుడు హనుమంతా రెడ్డి ,గ్రంధపాలకుడు గొలమారి రామకృష్ణ రెడ్డి ,సభ్యులు కిరణ్ బాబు ,రమేష్ ,అంకయ్య ,గౌతమ్,బాలా క్రిష్ణాచారి,ఇమ్రాన్,రసూల్,అంజి రెడ్డి,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


Friday, March 30, 2018

గ్రంధాలయములో సభ్యత్వ నమోదు కార్యక్రమము

యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ గిద్దలూరు మండల కమిటి వారి ఆద్వర్యములో స్థానిక యాదవ వీధిలో ఉన్న ప్రాధమికోన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సభ్యుల సొంత నిధులతో గిద్దలూరు శాఖా గ్రంధాలయములో సభ్యత్వ నమోదు కార్యక్రమము చేశారు.తదనంతరం విద్యార్థులను ఉద్దేశించి గ్రంధపాలకుడు గొలమారి రామక్రిష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే దినపత్రికలు,మంచి కథలు మరియు గాంధీ,వివేకానంద,అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకాలు చదవాలని, గ్రంధాలయములో సభ్యత్వము తీసుకున్న వారు రద్దు చేసుకున్న యెడల వారి డబ్బులు తిరిగి ఇవ్వబడును అని తెలిపారు.అద్యక్షులు సయ్యద్ ఫరూక్ మాట్లాడుతూ పుస్తకాలే నిజమైన స్నేహితులు అని అన్నారు ,ఉపాధ్యక్షులు గొలమారి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో గ్రంధాలయమును సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరారు.ఈ కార్యక్రమములో ప్రాధమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఏ.వెంకటేశ్వర్లు ,సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ ,పి.జేమ్స్ పాల్ ,సాయి కృష్ణ ,నాయబ్ రసూల్ ,శ్రీకాంత్ రెడ్డి ,అంకయ్య ,రమేష్ ,గౌతమ్ పాల్గొన్నారు.




Friday, February 23, 2018

అట్టలు,పెన్నులు పంపిణి కార్యక్రమము

అట్టలు పంపిణీ చేస్తున్న దాత వీరయ్య


విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రముఖ వ్యాపారవేత్త గంజి వీరయ్య అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో యువ ప్రగతి పథం స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ బాలుర, బాలికల పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు సోమవారం పరీక్ష అట్టలు,పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తెచ్చిపెట్టాలని విద్యార్థులకు సూచించారు. స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందన్నారు. ఆయా పాఠశాలల్లో ప్రథమస్థానం సాధించిన విద్యార్దులకు వీరయ్య రూ.3వేలు, శ్రీనివాస డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రూ.వెయ్యి ఇస్తామని తెలిపారు. గ్రంథపాలకుడు రామక్రిష్ణారెడ్డి, యువ ప్రగతి పథం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్య క్షుడు ఫరూక్,ఉపాద్యక్షుడు జగదీశ్వర రెడ్డ్డి ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.