Tuesday, January 30, 2018

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వర్ధంతి

మహాత్మాగాంధీ వర్ధంతి



గిద్దలూరు శాఖా గ్రంధాలయంలో మంగళవారం ఉదయం మహాత్మాగాంధీ 70 వ వర్ధంతి జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వచ్చిన శ్రీ గంజి వీరయ్య ( వెంకటేశ్వర స్వామి దేవస్తానం అధ్యక్షులు ) గారు ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు .

అమరవీరుల సంస్మరణ దినోస్తావాన్ని గుర్తు చేసుకుంటూ దేశ రక్షణ కొరకు అమరులు అయిన సైనిక కుటుంబాలకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.

గ్రంధపాలకుడు జి.రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ అమరులు అయిన త్యాగధనుల ,స్వాతంత్ర్య సమర యోధుల కళలను నిజం చేయటమే నేటి యువత అర్పించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు .గ్రంధాలయ అభివృద్ధి లో భాగంగా 15 కుర్చీలను గ్రంధాలయమునకు బహుకరణగా ఇస్తానని గంజి వీరయ్య ప్రకటించారు .ఈ కార్యక్రమములో పాఠకులు ,విద్యార్థులు, MPUP స్కూల్ ఉపాద్యాయులు బాల వెంకటేశ్వర్లు ,యువ ప్రగతి పథం అధ్యక్షుడు ఫరూక్ ,ఉపాధ్యక్షుడు జి .జగదీశ్వర రెడ్డి ,సభ్యులు గౌతమ్ ,రమేష్ పాల్గొన్నారు .అనంతరం విద్యార్థులకు బహుమతులు అందచేశారు