Tuesday, January 30, 2018

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వర్ధంతి

మహాత్మాగాంధీ వర్ధంతి



గిద్దలూరు శాఖా గ్రంధాలయంలో మంగళవారం ఉదయం మహాత్మాగాంధీ 70 వ వర్ధంతి జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వచ్చిన శ్రీ గంజి వీరయ్య ( వెంకటేశ్వర స్వామి దేవస్తానం అధ్యక్షులు ) గారు ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు .

అమరవీరుల సంస్మరణ దినోస్తావాన్ని గుర్తు చేసుకుంటూ దేశ రక్షణ కొరకు అమరులు అయిన సైనిక కుటుంబాలకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.

గ్రంధపాలకుడు జి.రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ అమరులు అయిన త్యాగధనుల ,స్వాతంత్ర్య సమర యోధుల కళలను నిజం చేయటమే నేటి యువత అర్పించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు .గ్రంధాలయ అభివృద్ధి లో భాగంగా 15 కుర్చీలను గ్రంధాలయమునకు బహుకరణగా ఇస్తానని గంజి వీరయ్య ప్రకటించారు .ఈ కార్యక్రమములో పాఠకులు ,విద్యార్థులు, MPUP స్కూల్ ఉపాద్యాయులు బాల వెంకటేశ్వర్లు ,యువ ప్రగతి పథం అధ్యక్షుడు ఫరూక్ ,ఉపాధ్యక్షుడు జి .జగదీశ్వర రెడ్డి ,సభ్యులు గౌతమ్ ,రమేష్ పాల్గొన్నారు .అనంతరం విద్యార్థులకు బహుమతులు అందచేశారు






















Sunday, January 28, 2018

విద్యార్థులకు వక్రుత్వ పోటీలు

ప్లాస్టిక్ కవర్స్ నిషేధం 


మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తగరపు సంచుల వినియోగాన్ని అరికట్టేందుకు మార్గదర్శకాలు అనే అంశంపై వక్రుత్వ పోటీలను మహాత్మా స్వచ్ఛభారత్ బృందం ,ఆపోవ సంయుక్తముగా నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు పట్టణం లోని వివిధ పాఠశాలల నుండి పాల్గొనారు .





















Friday, January 26, 2018

భారత గణతంత్ర దినోత్సవం

భారత గణతంత్ర దినోత్సవం


భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు[1]. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.






                       

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

నేతాజీ జయంతి వేడుకలు


సుభాష్ చంద్రబోస్ 1897 లో, భారతదేశంలోని ఒడిషా లోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయరు. తీవ్రమైన జాతీయవాది. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభావతి దేవి.


నేతాజీ' సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.





స్వామీ వివేకానంద జయంతి

స్వామీ వివేకానంద జయంతి 


స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.