Friday, March 30, 2018

గ్రంధాలయములో సభ్యత్వ నమోదు కార్యక్రమము

యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ గిద్దలూరు మండల కమిటి వారి ఆద్వర్యములో స్థానిక యాదవ వీధిలో ఉన్న ప్రాధమికోన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సభ్యుల సొంత నిధులతో గిద్దలూరు శాఖా గ్రంధాలయములో సభ్యత్వ నమోదు కార్యక్రమము చేశారు.తదనంతరం విద్యార్థులను ఉద్దేశించి గ్రంధపాలకుడు గొలమారి రామక్రిష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే దినపత్రికలు,మంచి కథలు మరియు గాంధీ,వివేకానంద,అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకాలు చదవాలని, గ్రంధాలయములో సభ్యత్వము తీసుకున్న వారు రద్దు చేసుకున్న యెడల వారి డబ్బులు తిరిగి ఇవ్వబడును అని తెలిపారు.అద్యక్షులు సయ్యద్ ఫరూక్ మాట్లాడుతూ పుస్తకాలే నిజమైన స్నేహితులు అని అన్నారు ,ఉపాధ్యక్షులు గొలమారి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో గ్రంధాలయమును సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరారు.ఈ కార్యక్రమములో ప్రాధమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఏ.వెంకటేశ్వర్లు ,సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ ,పి.జేమ్స్ పాల్ ,సాయి కృష్ణ ,నాయబ్ రసూల్ ,శ్రీకాంత్ రెడ్డి ,అంకయ్య ,రమేష్ ,గౌతమ్ పాల్గొన్నారు.