అట్టలు పంపిణీ చేస్తున్న దాత వీరయ్య
విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రముఖ వ్యాపారవేత్త గంజి వీరయ్య అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో యువ ప్రగతి పథం స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ బాలుర, బాలికల పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు సోమవారం పరీక్ష అట్టలు,పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తెచ్చిపెట్టాలని విద్యార్థులకు సూచించారు. స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందన్నారు. ఆయా పాఠశాలల్లో ప్రథమస్థానం సాధించిన విద్యార్దులకు వీరయ్య రూ.3వేలు, శ్రీనివాస డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రూ.వెయ్యి ఇస్తామని తెలిపారు. గ్రంథపాలకుడు రామక్రిష్ణారెడ్డి, యువ ప్రగతి పథం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్య క్షుడు ఫరూక్,ఉపాద్యక్షుడు జగదీశ్వర రెడ్డ్డి ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.